ఈవీఎంలపై వైసీపీకి అనుమానాలు.. బ్యాలెట్‌ ఎన్నికలు జరగాలని ఈసీకి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-03 15:20:40  IST  )

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై వైసీపీ పలు సందేహాలు లేవనెత్తుతోంది...

ఈవీఎంలపై వైసీపీకి అనుమానాలు.. బ్యాలెట్‌ ఎన్నికలు జరగాలని ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో జరిగిన ఎన్నికల తీరుపై వైసీపీ(Ycp) పలు సందేహాలు లేవనెత్తుతోంది. అంతేకాదు ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, ఇతర నాయకులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్(EVM Battery Charging) సహా అనేక అంశాలు ప్రస్తావించామని తెలిపారు. భవిష్యత్‌లో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. కాగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది. 175 నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా గెలవలేదు. అప్పటి నుంచి కూడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని పలువురు వైసీపీ కిందస్థాయి నేతలు ఆరోపించారు. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story