వైసీపీ సర్కార్ చెట్లు నరకడం తప్ప పెంచింది లేదు: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఐదేళ్ల వైసీపీ పాలనలో చెట్లను నరికారే తప్ప.. పెంచింది లేదని సీఎం చంద్రబాబు అన్నారు.

వైసీపీ సర్కార్ చెట్లు నరకడం తప్ప పెంచింది లేదు: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో చెట్లను నరికారే తప్ప.. పెంచింది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ అమరావతిలోని తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుషయ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు తీసుకుంటున్న చర్యలను సీఎంకు పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. రీసైక్లింగ్‌ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని సీఎం వారికి సూచించారు. అదేవిధంగా రీసైక్లింగ్‌కు ప్రత్యేకంగా ఓ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై తనకు రిపోర్టు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. నల్లమల పరిరక్షణకు అంకారావు తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు పదో తరగతి విద్యార్థిని కృషి చేయడం సంతోషకరమని అన్నారు. ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కూడా పర్యావరణ పరిరక్షణలో కీలకమైందని తెలిపారు.

సీఎం హెలికాప్టర్‌లో వస్తే చెట్లను నరికారు..

ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీకి చెట్లు నరకడమే తెలుసని.. పెంచిది లేదని ఆరోపించారు. సీఎం హెలకాప్టర్‌లో వస్తుంటే కూడా చెట్లను నరికిన సందర్భాలు చూశామని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్రంలో 30.05 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50 శాతంగా పెంచాలన్నారు. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచానికే సవాలుగా మారిందని అన్నారు. తద్వారా వాతావరణలో పెను మార్పులు వస్తున్నాయని కామెంట్ చేశారు. భవిష్యత్తు తరాల కోసం వృద్ధుడు చెట్లను నాటిన కథ అందరికీ తెలుసని అన్నారు. అందరూ తమ స్వార్థం కోసం కాకుండా భావి తరాల కోసం బతకాలన్నారు.

నా మనసుకు నచ్చిన సబ్జెక్ట్ పర్యావరణ పరిరక్షణ..

పద్మశ్రీ వనజీవి రామయ్య తన దగ్గరికి ఎప్పుడు వచ్చినా.. ఓ మొక్కలను తీసుకొచ్చేవైసీపీ సర్కార్ చెట్లు నరకడం తప్ప పెంచింది లేదు: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్వారని సీఎం గుర్తు చేశారు. ఈ రోజుల ఆయనను అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆదాయం పెంచడమే కాదని.. ఆరోగ్యం, పర్యావరణం రక్షించుకోవడం కూడా అందులో భాగమేనని అన్నారు. తన మనసుకు చాలా దగ్గరగా ఉండే సబ్జెక్ట్ పర్యావరణ పరిరక్షణ అని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం మనుషులకే కాదు.. జంతువులకు కూడా ప్రమాదకరంగా మారిందని అన్నారు. తినే తిండితో పాటు పండించే పంటలు కూడా ప్లాస్టిక్‌మయం అవుతున్నాయని కామెంట్ చేశారు.

చెత్త నుంచచి కూడా సంపద సృష్టించే మార్గాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వేస్టేజ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలను ప్రారంభించామని తెలిపారు. టీడీపీ ప్రారంభించిన ఆ ప్రయత్నాలను గత వైసీపీ సర్కార్ మధ్యలోనే నిలిపి వేసిందని అన్నారు. వరి వ్యర్థాల నుంచి కూడా బయో ఫ్యూయెల్ తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇంట్లోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని పిలుపునిచ్చారు. కొందరు చికెన్ షాపుల్లో వ్యర్థాలను చేపల పెంపకంలో వాడుతున్నారని.. అలా చేస్తే ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story