మాజీ సీఎం జగన్ దూకుడు.. 11న మరో కార్యక్రమం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-07 10:13:10  IST  )

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పోరాటానికి శ్రీకారం చుట్టారు..

మాజీ సీఎం జగన్ దూకుడు.. 11న మరో కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Ys Jagan Mohan Reddy) మరో పోరాటానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎన్నికల హామీల అమలు చేయకపోవడం, మిర్చి రైతు సమస్యలపై ధర్నాలు, నిరసనలు చేపట్టారు. తాజాగా పొగాకు రైతు సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగ ఈ నెల 11న ఆయన ప్రకాశం జిల్లా పొదిలి(Prakasam District Podili)లో పర్యటించనున్నారు. పొగాకు కొనుగోళ్లను పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.


ఈ విషయంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు(Former Minister Karumuri NageswaraRao) స్పష్టత ఇచ్చారు. అంతేకాదు కూటమి సర్కార్‌పై విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు సర్వనాశనం అవుతున్నారని ఆరోపించారు. దళారీలను ఈ ప్రభుత్వం పెంచిపోషిస్తోందని చెప్పారు. పొగాకు రైతులను కూటమి నాయకులు నిలువునా ముంచారని తెలిపారు. 11 పొదిలిలో పొగాకు రైతులను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బర్లీ పొగాకు కొనుగోళ్లకు స్పందనలేదన్నారు. ధాన్యం డబ్బుల కోసం నెలలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

Next Story