పది రోజుల్లో ఉప ఎన్నికలు: కూటమి నాయకులపై ఈసీకి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నేతలపై ఈసీకి వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు..

పది రోజుల్లో ఉప ఎన్నికలు:  కూటమి నాయకులపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు జడ్పీటీసీ(Zptc), ఎంపీటీసీ(Mptc) స్థానాలకు ఆగస్టు 10న ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని(Election Commissioner Neelam Sawhney)ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలు శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కలిశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని వినతి పత్రం అందజేశారు. తిరుపతి, తిరువూరు, కుప్పం మున్సిపల్ బై ఎలక్షన్లలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆగస్టు 10న జరిగే ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్యనే పోలింగ్ జరగాలని, ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరారు. ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష నేతల పర్యటనపై ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

Next Story