తిరుప‌తిలో వైసీపీ భారీ నిర‌స‌న‌.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు..

తిరుప‌తిలో వైసీపీ భారీ నిర‌స‌న‌.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu)ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి(Tirupati)లో వైసీపీ(Ycp) శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి(Bhumana Abhinay Reddy) ఆధ్వర్యంలో కార్యకర్తలు తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం..

ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 యాక్ట్ పేరుతో నిరసనలను అడ్డుకుంటున్నారని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా తాము ఈ ఆందోళనలు చేపట్టామని చెప్పారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదని భూమన అభినయ్ రెడ్డి హెచ్చరించారు.

Next Story