బోరుగడ్డ అనిల్‌కు ఎదురుదెబ్బ.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-25 09:04:06  IST  )

వైసీపీ కార్యకర్త, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...

బోరుగడ్డ అనిల్‌కు ఎదురుదెబ్బ.. మధ్యంతర బెయిల్ నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యకర్త, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తరపున దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను(Interim bail petition) ధర్మాసనం కొట్టివేసింది. గతంలో బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టును తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఆయన మళ్లీ హైకోర్టునే ఆశ్రయించే అవకాశం ఉంది.

మరోవైపు సీఎం చంద్రబాబు ఫ్యామిలీని దూషించిన కేసు విచారణ కొనసాగుతోంది. 2023లో ఆయనపై పోలీసులకు టీడీపీ నాయకురాలు తేజస్విని ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురం కోర్టులో అనిల్‌ను పోలీసులు ప్రవేశ పెట్టారు. తీర్పు తర్వాత మళ్లీ జైలుకు తరలించనున్నారు.

Next Story