- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ స్టేడియంకు వైయస్ఆర్ పేరు తొలగింపు.. స్టేడియం వద్ద వైసీపీ నేతల నిరసన
వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడంపై వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Vizag International Cricket Stadium) కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) పేరు తొలగించడంపై వైసీపీ నేతలు (YCP Leaders) ఆందోళనలు (Protest) చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions) కూటమి ప్రభుత్వం (Coalition Government) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో వైఎస్ఆర్ జిల్లా (YSR District) పేరును వైఎస్ఆర్ కడప (YSR Kadapa) జిల్లాగా మార్చింది. అలాగే తాడిగడప మున్సిపాలిటీకి, వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కూటమి పార్టీల నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం పట్ల వైసీపీ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కొందరు వైసీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. అంతేగాక ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మధురవాడలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకొని, వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ క్రికెట్ స్టేడియానికి తొలగించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తిరిగి పునరుద్దరించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక వైఎస్ఆర్ పేరు తిరిగి పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ నెల 24, 30 తేదీలలో ఇదే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు ఉండటంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






