- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘YSR లెజెండ్ అయ్యారు అంటే.. ఆయన ప్రోత్సాహమే’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నారు

దిశ,వెబ్‌డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల సాహసానికి మారు పేరు అన్నారు. YSRను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారని తెలిపారు. YSR లెజెండ్ అయ్యారు అంటే వైఎస్ రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఈ తరుణంలో.. ‘‘రాజారెడ్డి ఒక ప్రజా నాయకుడు. ప్రజా సమస్యలపై రాజారెడ్డికి ఎంతో చిత్తశుద్ధి ఉండేది. నేను దగ్గర నుంచి రాజారెడ్డినీ చూశాను. గంటల తరబడి ప్రజల సమస్యలు వినే వాడు. వాటిని పరిష్కారం అయ్యే వరకు నిద్ర పోయే వాడు కాదు. ప్రజల కోసం ఎన్నో విద్యాసంస్థలు కట్టించారు. ప్రజలకు ఆసుపత్రి కూడా కట్టించి ఇచ్చారు. ప్రజల కోసం ఇంత చేసిన రాజారెడ్డి ప్రజా నాయకుడు. ఆయన స్పూర్తి మాకు , నేటి తరానికి ఎంతో ఆదర్శం’’ అని వైఎస్ షర్మిల వెల్లడించారు.






