భక్తి మార్గం ద్వారానే శాంతి, సౌభ్రాతృత్వం: వైఎస్ జగన్

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లి నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు..

భక్తి మార్గం ద్వారానే శాంతి, సౌభ్రాతృత్వం: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం నందిపల్లి నందీశ్వర ఆలయం(Nandipalli Nandeeshwara Temple)లో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister YS Jagan Mohan Reddy) పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని జగన్ తెలిపారు.

నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్‌ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను జగన్ అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని జగన్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ఠలో జగన్.. వీడియో

Next Story