- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివారం పూట కడప జిల్లాలో తీవ్ర విషాదం
ఆదివారం పూట కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకే నదిలోకి దిగిన యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు....

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం పూట కడప జిల్లా(Kadapa District)లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకే నది(River)లోకి దిగిన యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన వల్లూరు మండలం పుష్పగిరి(Pushpagiri)లో జరిగింది. ముగ్గురు స్నేహితులు స్థానికంగా ఉన్న పెన్నా నది(Penna River) వద్దకు వెళ్లారు. కొంతసేపు నది ఒడ్డున కూర్చుకుని కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత నదిలో ఈతకు దిగారు. అయితే వీరిలో ఇద్దరు యువకులు నదిలో గల్లంతయ్యారు. మూడో యువకుడు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు యువకులు శ్రీనాధ్, చైతన్య నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడో యువకుడి నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






