Kadapa: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. బీటెక్ రవి అనుచరుల హల్ చల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-16 13:36:38  IST  )

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది....

Kadapa: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. బీటెక్ రవి అనుచరుల హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: కడప కలెక్టరేట్(Kadapa Collectorate) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత బీటెక్ రవి(TDP leader BTech Ravi) అనుచరులు హల్ చల్ చేశారు. సిద్ధవటం మండలం గుండ్లమూల ఇసుక క్వారీకి ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. దీంతో ఈరోజు కలెక్టరేట్ వద్ద టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. దీంతో బీటెక్ రవి అనుచరులు అడ్డుకున్నారు. మైనింగ్ డీడీ కార్యాలయం వద్ద నిలబడి టెండర్లు వేయకుండా బెదిరింపులకు దిగారు. టెండర్ల బాక్సులో నీళ్లు పోశారు. వైసీపీ నాయకులకు టెండర్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు నిర్వహిస్తే ఊరికునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బీటెక్ రవి అనుచరులను చెదరగొట్టారు. పరిస్థితిని సద్దుమనిగించారు. మరోసారి కూడా బీటెక్ అనుచరులు వచ్చే అవకాశం ఉందనే సమచారంతో ఈ కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని హెచ్చరించారు.

Next Story