తుఫాను ప్రభావం.. కుప్పకూలిన బ్రహ్మంగారి నివాసం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-29 09:42:45  IST  )

కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో ఉన్న కాలజ్ఞాన కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (Pothuluri Veera Brahmendra Swami) నివాసం ఇటీవల కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నేలకూలింది.

తుఫాను ప్రభావం.. కుప్పకూలిన బ్రహ్మంగారి నివాసం
X

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో ఉన్న కాలజ్ఞాన కర్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (Pothuluri Veera Brahmendra Swami) నివాసం ఇటీవల కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నేలకూలింది. దీంతో స్వామివారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాస గృహాన్ని కాపాడడంలో నిర్వాహకులు, ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపిస్తున్నారు. చారిత్రాత్మకమైన (Historical) నేపథ్యం ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మరచిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. దాన్ని పునర్నిర్మించినా గత వైభవం ఉండదని అభిప్రాయపడుతున్నారు. పురాణ పురుషులు, గురువుల ఆనవాళ్ళను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహించడం తగదంటున్నారు. వారిచ్చిన జ్ఞాన (Knowledge) సంపదనే కాదు, వారు నడయాడిన చరిత్రను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ ఆవేదనను పీఠం నిర్వాహకులు, ప్రభుత్వం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

READ MORE .....

శ్రీశైల పుణ్యక్షేత్రంలో భారీ ప్రమాదం.. పాతాళగంగ దారిలో విరిగిపడిన కొండచరియలు

Next Story