గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత.. పురుగులన్నం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆందోళన

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లి గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రమైన వాతావరణంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు.

గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత.. పురుగులన్నం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) బ్రహ్మంగారిమఠం మండలం(Brahmangarimatham Mandal) తోట్లపల్లి గురుకుల పాఠశాల(Thotlapalli Gurukul School)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రమైన వాతావరణంపై విద్యార్థులు(Students) ఆందోళనకు దిగారు. వడ్డించే అన్నంలో పురుగులు వస్తున్నాయని, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో సరైన తిండి లేక, అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం

అయితే ఈ దారుణ పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు పస్తులు తప్పడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని తల్లిదండ్రులు కోరారు.

Next Story