పులివెందుల స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌పై మేము దాడి చేయలేదు: టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి

by Vemula.Srinu Prasad |

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌పై తాము దాడి చేయలేదని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి తెలిపారు...

పులివెందుల స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌పై మేము దాడి చేయలేదు: టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక(Pulivendula ZPTC Election).. సాధారణ ఎలక్షన్‌ను తలపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా సురేశ్ కు వైసీపీ మద్దతు ఇస్తోంది. టీడీపీ(Tdp) నుంచి సైతం అభ్యర్థి రంగంలోకి దిగారు. రెండు పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతి దాడులతో పులివెందుల నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అయితే స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌పై దాడి జరిగింది. అయితే ఈ దాడులు టీడీపీ నేతలే చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి(TDP Polit Bureau Member Srinivasa Reddy) స్పందించారు. స్వతంత్ర అభ్యర్థి సురేశ్‌పై తాము దాడి చేయించలేదని ఆయన తెలిపారు. ప్రజలను భయాందోళనకు గురి చేయడానికే వైసీపీ నేతలు కుట్ర చేసి నిందలు తమపై వేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు. పులివెందులను టీడీపీకీ అడ్డాగా మారుస్తామని దీమా వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Next Story