- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh : యువగళానికి తాత్కాలిక బ్రేక్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యువగళం పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గురువారం జమ్మలమడుగులో పాదయాత్రను లోకేశ్ ముగించారు. తర్వాత అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో అమరావతికి పయనమయ్యారు. శుక్రవారం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లి రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు. తిరిగి ఈనెల 30న పున:ప్రారంభించనున్నారు.
Next Story






