- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: ఐపీఎల్ బెట్టింగ్‌లకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి
by Vemula.Srinu Prasad |
ఐపీఎల్‌లో బెట్టింగులు పెట్టి అప్పుల బాధ భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు...

X
దిశ,డైనమిక్ బ్యూరో: ఐపీఎల్‌లో బెట్టింగులు పెట్టి అప్పుల బాధ భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలం ఆకుల వారిపల్లి సమీపంలోని శివాలయంలో జరిగింది. శివాలయంలోనే ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెయ్యాల వారిపల్లికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి (24) హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చారు. ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






