కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Thanuru Gopichand |

వైయస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు (Mydukuru) మండలం తువ్వపల్లె కూడలి సమీపంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది.

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, కడప: వైయస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు (Mydukuru) మండలం తువ్వపల్లె కూడలి సమీపంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. 67వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు కడపకు (Kadapa) చెందిన కుందవరం సాయి సంజయ్(24),చింతల సంతోష్ (24) గా గుర్తించారు. వారు స్కూటీపై బద్వేలు వైపునకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెంది నట్లు పోలీసులు తెలిపారు. కడపలోని బెల్లంముండికి చెందిన సాయి సంజయ్ బంగారు అప్రైజర్గా పని చేస్తుండగా, చిన్నచౌక్ అశోకనగర్ కు చెందిన సంతోష్ డిగ్రీ పూర్తి చేశారు. సంజయ్, సంతోష్ లు ఇరువురు ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులని (Friends) బంధువులు చెప్పారు. ప్రమాద సంఘటనపై పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story