- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు అన్ని విషయాలు చెప్పా: జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర
పోలీసులకు అన్ని విషయాలు చెప్పానని రైల్వే కోడూరు జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: పోలీసులకు అన్ని విషయాలు చెప్పానని రైల్వే కోడూరు జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర(Railway Kodur Janasena Leader Tatamshetty Nagendra) తెలిపారు. హర్షవీణపై దాడి ఘటనలో ఆయనను పోలీసులు విచారించారు. తాతంశెట్టి నాగేంద్రతో పాటు నవీన్‌లను రేణిగుంట డీఎస్పీ ఐదు గంటల పాటు విచారించారు. విచారణ ముగియడంతో తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడారు. దాడి ఘటనపై పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించానని చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరించామని తాతంశెట్టి పేర్కొన్నారు. ఎప్పుడూ పిలిచినా రావాలని పోలీసులు సూచించారని తెలిపారు. తాము ఎప్పుడూ సిద్ధమేనని పోలీసులకు తాను తెలిపినట్లు తాతంశెట్టి నాగేంద్ర పేర్కొన్నారు.
కాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై తాతంశెట్టి నాగేంద్ర కర్రతో దాడి చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాతంశెట్టి నాగేంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా శనివారం విచారణకు రావాలని నోటీసులివ్వడంతో ఆయన హాజరయ్యారు. సుదీర్ఘ విచారణకు అన్ని సమాధానాలు చెప్పినట్లు తాతంశెట్టి స్పష్టం చేశారు.






