కడప జిల్లాలో వృద్ధ జంట దారుణ హత్య.. వాటికోసమేనా?

by Naga Rani Yarlagadda |

కడప జిల్లాలో వృద్ధ జంట దారుణ హత్యకు గురయ్యారు.

కడప జిల్లాలో వృద్ధ జంట దారుణ హత్య.. వాటికోసమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో వృద్ధ జంట దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రోకలిబండతో వారి తలలను పగలగొట్టి హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది. నాగప్ప (60), ఓబులమ్మ భార్య భర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అలాగే ఓబులమ్మ అంగీకారంతో నాగప్ప .. పెద్దక్క (53) అనే మహిళతో 30 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ జంట తాడిపత్రి రోడ్డులో పెద్ద పసుపుల మోటులో ఇటుకల బట్టీ రన్ చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఓబులమ్మ ఇద్దరు కొడుకులతో కలిసి జమ్మలమడుగులో ఉంటుంది.

నాగప్ప, పెద్దక్క ఇటుకల బట్టీలోని తమ ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రోకలిబండతో వారి తలలను పగలగొట్టి దారుణంగా చంపేశారు. ఆ ఇంటిలోని బీరువాలో గల వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో దొంగతనం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు కోసమే హత్యలు చేశారా ? లేక కుటుంబ గొడవలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి.. కేసు నమోదు చేశారు.

Next Story