- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యాబేజీ మూటల మాటున స్మగ్లింగ్.. పోలీసులు చెక్ చేయడంతో..!
కడప జిల్లా భాకరపేట చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన సోదాలు చేశారు

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District)లో పుష్పరాజులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్(Red sandalwood smuggling) చేసేందుకు నయా ప్లాన్ అమలు చేశారు. కానీ బెడిసికొట్టి పారిపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకుట్ట వేయాలంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఒక్క కేజీ ఎర్రచందనం కనిపించినా పట్టుకుంటున్నారు. అక్రమదారులను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు.
తాజాగా కడప జిల్లా భాకరపేట చెక్ పోస్టు(Bhakarapet Check Post) పోలీసులు వాహన సోదాలు చేశారు. మినీ లారీ(Mini lorry)లో తరలిస్తున్న 84 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టు వద్ద తనిఖీలను గమనించిన దుండగులు...లారీని వదిలి పారిపోయారు. దీంతో ఎర్రచందనం దుంగలతో పాటు లారీని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 11 లక్షలు ఉటుందని అంచనా వేశారు. ఎర్రచందనం తరలింపు అక్రమని, ఎవరు రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎర్రచందనం తరలింపుపై తమకు సమాచారం అందించాలని, అట్టి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. నిషేధిత పదార్ధాలు డ్రగ్స్, గంజాయి రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






