ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుక

by Dishafeatures2 |
ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుక
X

దిశ, కడప: నందమూరి బాలకృష్ణ 63వ జన్మ దిన వేడుకను శనివారం కడపలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పీరయ్య ఆధ్వర్యంలో ఎస్ఆర్ థియేటర్లో 63 కేజీల కేక్ ను అభిమానుల మధ్య కట్ పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీరయ్య మాట్లాడుతూ.. సినీ, రాజకీయ, సేవా రంగంలో లెజెండ్ బాలకృష్ణ అని అన్నారు. తమ ఆరాధ్య దైవమైన నందమూరి బాలయ్య పుట్టినరోజు వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

నటన రంగంలో, రాజకీయ రంగంలో, సేవా రంగంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని, ఆయన అభిమానులుగా మేము గర్వపడుతున్నామని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇబ్రహీం, చికెన్ బాష, ఏలియా, స్వర్ణలత, నిర్మల పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed