MLA Raghurami Reddy: ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-18 14:57:06  IST  )

రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా అని మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి సవాల్ విసిరారు...

MLA Raghurami Reddy: ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా?
X

దిశ, కడప: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. చాపాడు మండలం సోమాపురం పంచాయతీ పరిధిలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేకనే జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతరత్రా పార్టీలతో జతకట్టడానికి దారులు వెదుకుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాల్లో విజయ దుందుభి మోగించడానికి సంసిద్ధంగా ఉందన్నారు. జగన్ మరో మారు ముఖ్యమంత్రి అవడం తథ్యమని రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు.

Next Story