మాజీ ఎమ్మెల్యే వసూళ్ల పర్వం.. ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-07-13 08:57:26  IST  )

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజలను భయపెట్టి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వసూళ్లు చేశారని ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

మాజీ ఎమ్మెల్యే వసూళ్ల పర్వం.. ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజలను భయపెట్టి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వసూళ్లు చేశారని ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయాలని.. ఆ డబ్బులను వెనక్కి ఇప్పిస్తామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో చాలా భూ దందాలు జరిగాయని, వాటిపైనా విచారణ చేయిస్తామని హెచ్చరించారు. జగన్ హయాంలో సంపాదకే సరిపోయిందని, ఒక్క మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జగన్ పాలన కడప స్టీల్ ప్లాంట్‌ను విస్మరించారని, అభివృద్ధి చేసి ఉంటే యువతకు చాలా ఉద్యోగాలు వచ్చేవని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు.

Next Story