Ys Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-09 10:51:47  IST  )

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు...

Ys Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనను సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే ఒకసారి విచారించింది. మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ చేసేటప్పుడు ఆడియో, వీడియోలు రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ తనకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిందని.. ఈ నోటీసులు ప్రకారం తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి అభ్యర్థించారు. దీంతో రేపటి సీబీఐ విచారణపై సస్పెన్స్ నెలకొంది. కోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూాడాలి.

Next Story