ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి ... నలుగురూ మృతి

by Vemula.Srinu Prasad |

క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయానికి నలుగురి బలి అయ్యారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన శివవెంకటకృష్ణ, భువనేశ్వరి దంపతులు 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు...

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి ... నలుగురూ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయానికి నలుగురి బలి అయ్యారు. ఈ ఘటన కడప జిల్లా(Kadapa District) ప్రొద్దుటూరు(Proddutur)లో జరిగింది. ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన శివవెంకటకృష్ణ, భువనేశ్వరి దంపతులు 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే భర్త శివవెంకటకృష్ణ రెండేళ్ల క్రితం భార్య, పిల్లలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ పిల్లలను చూసుకుంటూ భువనేశ్వరి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వరికి అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. పిల్లల కోసం భరించింది. కానీ ఈ మధ్యన వేధింపులు విపరీతమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భువనేశ్వరి మార్చి 26న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ముగ్గురు చిన్నారులకు తాగించారు. ఆ తర్వాత తానూ తాగారు. దీంతో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

నలుగురూ మృతి

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 28న తల్లి భువనేశ్వరి మృతి చెందగా.. పిల్లల పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అస్పత్రికి తరలించారు. కానీ ఏప్రిల్10న రెండో కూతురు లిఖిత , 15న కుమారుడు మృతి చెందారు.16న పెద్ద కుమార్తె కుసుమ మృతి చెందారు. దీంతో ప్రొద్దుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆవేశపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

Next Story