Kadapa: పోలీసుల అదుపులో కొమ్మా పరమేశ్వర రెడ్డి

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసు నిందితుడు ఉమా శంకర్ రెడ్డి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మా పరమేశ్వర రెడ్డిని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Kadapa: పోలీసుల అదుపులో కొమ్మా పరమేశ్వర రెడ్డి
X

దిశ, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసు నిందితుడు ఉమా శంకర్ రెడ్డి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మా పరమేశ్వర రెడ్డిని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమ్మా పరమేశ్వర రెడ్డి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం తనపై దాడి చేశారని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరమేశ్వర రెడ్డి ,అతని కూమారుడు సునీల్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story