Kadapa: రైతులను నిండా ముంచిన అకాల వర్షం

by Disha Web Desk 16 |
Kadapa: రైతులను నిండా ముంచిన అకాల వర్షం
X

దిశ, కడప: అకాలంగా కురిసిన వర్షం జిల్లా రైతులను ముంచేసింది. రెండు రోజులుగా కురిసిన వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టాలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో 22 గ్రామాల్లో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వడగళ్ల వాన కారణంగా పండ్ల తోటలు, వరి పంటలతో పాటు పలు రకాల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పెను గాలులకు వ్యక్తి మృతి చెందారు. పెద్దముడియం మండలం అరవేటిపల్లె‌లో మరొకరు మృతి చెందారు. పెను గాలలకు టైల్స్ మీదబడి ప్రాణాలు కోల్పోయారు. పాలూరులో వడగళ్ల వానకు 150 గొర్రెలు చనిపోయాయి.

526 హెక్టార్లలో పంట నష్టం

ఈ వర్షాల కారణంగా 43 హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంట, 102 హెక్టార్లలో మినుము, 13 హెక్టార్లలో పెసర పంటలకు నష్టం జరిగింది. అలాగే 258 ఎకరాల్లో మొక్కజొన్న పంట, 48 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. మరో 62 హెక్టార్లలో సజ్జ పంటకు నష్టం వాటిల్లింది. మొత్తం 526 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు.


Next Story

Most Viewed