- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kadapa | తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
కడప నగరంలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

దిశ, కడప: కడప నగరంలో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జస్వంతి అనే బాలిక కడప-రాయచోటి రిమ్స్ రింగ్ రోడ్డు వద్ద గల ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో విద్యార్థిని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం నుంచి కాల్ వెళ్లింది. జస్వంతి ఆరోగ్యం బాగాలేదని.. ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నామని యాజమాన్యం సందేశం ఇచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులైన మురళి మాధవ్ దంపతులు యాజమాన్యం పేర్కొన్న హాస్పిటలుకు చేరుకున్నారు. వైద్యులు బాలిక ప్రాణాలతో లేదని వారికి తెలియజేశారు. మెడ చుట్టూ తాడు బిగించిన ఆనవాళ్లు కూడా కనిపించాయని తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడిందని చెబుతున్నారని వాపోయారు. పాఠశాల నిర్వాహకులే తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులతో పాటు బంధువులు రిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు.






