- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లుంగీలు ప్రమోట్ చేస్తున్న సీనియర్ హీరోయిన్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా కట్టుకుని మరీ ఫొటోలకు పోజులు.. ఆడ, మగ తేడా లేకుండా..
సీనియర్ హీరోయిన్ జయసుధ ఒకప్పుడు స్టార్ రేంజ్ ఎంజాయ్ చేసింది. సహజ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమ్మ పాత్రలకు పరిమితమైన ఆమెకు 70లలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ ఉండగా... ఆమెను లుంగీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది శంఖు

దిశ, ఫీచర్స్ : సీనియర్ హీరోయిన్ జయసుధ ఒకప్పుడు స్టార్ రేంజ్ ఎంజాయ్ చేసింది. సహజ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమ్మ పాత్రలకు పరిమితమైన ఆమెకు 70లలో ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ ఉండగా... ఆమెను లుంగీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది శంఖు మార్క్ లుంగీల కంపెనీ. ఇందుకు సంబంధించిన యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇందులో తను కూడా లుంగీ కట్టుకుని కనిపించింది. ఆడవాళ్లు, మగవాళ్లను అందరినెంతో ఆకర్షించే శంఖు మార్క్ లుంగీల బ్రాంచీల గురించి కూడా ఇందులో వివరించారు.
దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. యాడ్ బాగుంది కానీ ఆడవాళ్లు కూడా లుంగీలు కట్టుకుంటారని ఇప్పటి వరకు తెలియదని సెటైర్ వేస్తున్నారు. ఇంకొందరు ఇప్పటికీ ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నామని చెప్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకుంటున్నారు. అయినా లుంగీలకు అమ్మాయిలను బ్రాండ్ అంబాసిడర్‌గా వాడటమేంటో.. తమిళనాడు, కేరళలో అలాగే వినియోగించేవారేమో అంటూ చర్చించుకుంటున్నారు. ఇంకొందరేమో ఈ ప్రకటన బర్మీస్ భాషలో ఉందని.. ఇప్పటికీ బర్మాలో అమ్మాయిలు లుంగీలు వాడుతారని చెప్తున్నారు.






