- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు....

X
దిశ,కడప: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఈ రోజు కాలేజీకి వెళ్లలేదు. హాస్టల్‌లో ఉన్న కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి విద్యార్థినులు కళాశాల డైరెక్టర్, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని తమ బంధువుల అబ్బాయిని ఇష్టపడ్డారని.. ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని తమకు సమాచారం తెలిసిందని కాలేజీ డైరెక్టర్ సంధ్యారాణి తెలిపారు.
Next Story






