- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి విద్యార్థులే కూలీలు..(VIDEO)
బడికి పోతే మాలాంటి కూలీ బతుకు పిల్లలకు ఉండదనుకుంటారు తల్లిదండ్రులు. ఒక పూట తిని మరో పూట తినకుండా పిల్లలకు మాత్రం అన్నీ అందుబాటులో ఉంచాలనుకుంటారు. వారిని గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు. ఈ క్రమంలో పాఠశాలలో తమ బిడ్డ గురించి ఏ చిన్న ప్రశంస

దిశ, వెబ్ డెస్క్ : బడికి పోతే మాలాంటి కూలీ బతుకు పిల్లలకు ఉండదనుకుంటారు తల్లిదండ్రులు. ఒక పూట తిని మరో పూట తినకుండా పిల్లలకు మాత్రం అన్నీ అందుబాటులో ఉంచాలనుకుంటారు. వారిని గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు. ఈ క్రమంలో పాఠశాలలో తమ బిడ్డ గురించి ఏ చిన్న ప్రశంస వచ్చినా మురిసిపోతుంటారు. కానీ కూలీ బతుకు ఉండకూడదని పిల్లలను బడికి పంపితే.. అక్కడే వారిని కూలీలుగా మార్చేశారు కొందరు దుర్మార్గులు. స్కూల్ కొత్త భవనం నిర్మాణ పనులకు వారినే లేబర్స్‌గా వాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఏపీ.. కడప జిల్లా.. మైదుకూరు నియోజకవర్గం.. నంద్యాలంపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌కు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పిల్లలనే కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌గా వాడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తానికి దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించామని.. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






