ఎన్నికల్లో విపక్షాలను దెబ్బ తీసేందుకే 2 వేల నోట్లు ఉపసంహరణ.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Disha Web Desk 14 |
ఎన్నికల్లో విపక్షాలను దెబ్బ తీసేందుకే 2 వేల నోట్లు ఉపసంహరణ.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, కడప: భారతీయ జనతాపార్టీ ముందస్తు ప్రణాళిక మేరకు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేందుకే రూ.2 వేలు నోట్ల మార్పిడి కి పాల్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని ఎస్.బి.ఐ మెయిన్ బ్రాంచ్ లో రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియను పరిశీలించి బ్యాంకు మేనేజర్లతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.2 వేల నోట్ల మార్పిడికి సంబంధించి అనేక వివాదాలు వస్తున్నాయన్నారు. ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకొక మాట చెపుతున్నారన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు, ఏ కార్డు అవసరం లేకుండా రూ.20 వేలు మార్చు కోచవచ్చని పేర్కొందన్నారు. ఇప్పుడు ఒక మేనేజర్ రూ50 వేలు మార్చుకోవాలంటే ఆధార్ కార్డ్ అవసరమని, అంత కంటే ఎక్కువ మోత్తంలో మార్చు కోవాలంటే పాన్ కార్డు అవసరమని లేదని చెపుతున్నారన్నారు. మరో మేనేజర్ ఆర్.బి.ఐ ఆదేశాల మేరకు ఆధార్, పాన్ కార్డు అవసరం లేకుండా డబ్బులు మార్చు కోవచ్చని చెపుతున్నారన్నారు. ఈ ఇరువురు మేనేజర్లు నోట్ల మార్పిడి పై విరుద్ద ప్రకటనలు చేస్తున్నారన్నారు. నోట్ల మార్పిడి పై ఎందుకు ఇంత అస్పష్టతగా వున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్.బి.ఐ అధికారులు సెప్టెంబరు వరకు నోట్ల మార్పిడి చేసుకోవచ్చని ప్రకటించారన్నారు. గతంలో చేపట్టిన నోట్ల రద్దు లో రూ.500లు, రూ.1000లు నోట్లు రద్దు చేసి అప్పటికప్పుడు చిత్తు కాగితాలు గా చేశారన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 6, 7 నెలలుగా ముందస్తు ప్రణాళిక ప్రకారం బి.జె.పి, దాని అనకూలమైన పార్టీలు గోడౌన్ లలో దాచుకున్న అవినీతి కి పాల్పడి దోచుకున్న డబ్బులను మార్చుకొని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు నేడు నోట్ల మార్పిడి అంశం తెరపైకి తెచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కా ప్రణాళిక మేరకు సామాన్య ప్రజలను ఇబ్బందులు చేసి సంపన్న వర్గాలకు మేలు చేసేలా వారు దాచుకున్న నల్లడబ్బును వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించారన్నారు. ఎదైనా చిత్తశుద్ది వుంటే రూ.2 వేల నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వుందని, ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

కేతు విశ్వనాథ్ రెడ్డికి నివాళులు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి బౌతిక కాయాన్ని మాజీమంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి, సిపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.Next Story