పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. గెలుపేవరిది?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-14 04:30:20  IST  )

ఈ నెల 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కడపలో ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది.

పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. గెలుపేవరిది?
X

దిశ,కడప: ఈ నెల 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కడపలో ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. కడప లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, వెంకటపతి, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య లు పర్యవేక్షిస్తున్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందులకు సంబంధించి 10 టేబుల్లలో ఒక రౌండ్ ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుల్లలో మూడు రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ , ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. మొత్తం వంద మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా ఇందులో 30 మంది, సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు స్టాటస్టికల్ అధికారులు ఉన్నారు.

కౌంటింగ్ ను బహిష్కరించిన వైసీపీ..

వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం పులివెందుల జరిగిన రీ పోలింగ్ ను కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే.

Next Story