ZP Election: మళ్లీ క్యాంపు రాజకీయం.. హైదరాబాద్‌‌కు జడ్పీటీసీలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-23 15:48:57  IST  )

రాష్ట్రంలో మళ్లీ క్యాంపు రాజకీయం షురూ అయింది...

ZP Election: మళ్లీ క్యాంపు రాజకీయం.. హైదరాబాద్‌‌కు జడ్పీటీసీలు..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మళ్లీ క్యాంపు రాజకీయం షురూ అయింది. ఈ నెల 27న జరగబోయే కడప జెడ్పీ చైర్మన్(Kadapa ZP Chairman) ఎన్నిక ఉత్కంఠగా మారింది. దీంతో క్యాంపు రాజకీయానికి వైసీపీ(Ycp) తెర తీసింది. టీడీపీ(Tdp) ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ జడ్పీటీసీలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ జడ్పీటీసీలను హైదరాబాద్(Hyderabad) తరలించేందుకు యత్నిస్తోంది. రేపు లేదా ఎల్లుండి జడ్పీటీసీ(Zdptc)లను కడప(Kadapa) నుంచి బస్సుల్లో తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా సరే తమ సిట్టింగ్ జెడ్పీ పీఠాన్ని మళ్లీ దక్కించుకునేందుకె వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వైసీపీ జడ్పీటీసీలను సీఎం జగన్ కాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ వద్దను కుంటే ఇడుపులపాయలోనే జడ్పీటీసీలను ఉంచాలని నిర్ణయించనున్నారు. అయితే జగన్ పులివెందులలోనే ఉండనున్న నేపథ్యంలో జడ్పీటీసీలను స్థానికంగానే ఉంచుతారని తెలుస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) సమావేశం తర్వాత ఏ విషయం అనేది తేలనుంది.

Next Story