Breaking: కడపలో వ్యక్తి దారుణ హత్య

by srinivas |   ( Updated:2025-04-16 00:59:10.0  )
Breaking: కడపలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కడప(Kadapa)లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా సాదిక్ అనే వ్యక్తి హత్య(Murder)కు గురయ్యారు. ఈ ఘటన బిల్డప్ సర్కిల్(Buildup circle) చోటు చేసుకుంది. సాదిక్‌ను దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ దాడిలో సాదిక్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాదిక్ మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి హత్య వివరాలు తెలుసుకున్నారు. సాదిక్ డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. మరియాపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కడప నగరం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది.

Next Story

Most Viewed