AP | ప్రొద్దుటూరు సీఐపై వేటు

by Thanuru Gopichand |

సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రొద్దుటూరు (Proddutur) సీఐ తిమ్మారెడ్డిపై వేటు పడింది.

AP | ప్రొద్దుటూరు సీఐపై వేటు
X

దిశ, వెబ్ డెస్క్ : సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రొద్దుటూరు (Proddutur) సీఐ తిమ్మారెడ్డిపై వేటు పడింది. ఈ మేరకు సీఐ తిమ్మారెడ్డిని (CI Timmaa Reddy) వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలను జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఇద్దరు బంగారు వ్యాపారుల మధ్య వివాదం నెలకొనగా సీఐ అందులో జోక్యం చేసుకున్నారు. శ్రీనివాసులు అనే వ్యాపారిని కిడ్నాప్ చేయించి చిత్ర హింసలకు గురి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎ మ్మెల్యే వరదరాజుల రెడ్డి కూడా ఇటీవల ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. పోలీసు స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం వ్యాపారి శ్రీనివాసులు అరెస్టు వ్యవహారంపై అసహనాన్ని ప్రకటించారు. ఎస్పీ స్థాయి కంటే పై అధికారుల ప్రమేయం ఉందని అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. వివాదం విషయమై ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబం కూడా ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో సీఐ తిమ్మారెడ్డిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story