Kadapa: జమ్మలమడుగు, పులివెందులకు సీఎం జగన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-13 13:31:39  IST  )

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు ...

Kadapa: జమ్మలమడుగు, పులివెందులకు సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు సైతం భూమి పూజ చేయనున్నారు.ఈ ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఇటీవల జిందాల్‌తో ఒప్పందం కుదరడంతో ఉక్కు పరిశ్రమ పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు భూమి పూజ చేయనున్నారు.

పులివెందులలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరు

అనంతరం పులివెందులలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు. అంతకుముందు బుధవారం ఉదయం సీఎం జగన్ తాడేపల్లి నుంచి సున్నపురాళ్లపల్లెకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆయన పులివెందుల వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story