- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, బకెట్లతో ఎత్తుకెళ్లిన జనం
కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో నెయ్యితో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నెయ్యి మొత్తం రోడ్డుపైకి, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రవహించింది...

X
దిశ, కడప: కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో నెయ్యితో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నెయ్యి మొత్తం రోడ్డుపైకి, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రవహించింది. విషయం స్థానిక గ్రామాలకు తెలియడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి వెళ్లారు. బిందెలు, బకెట్లు, చెంబులు, బాటిళ్లతో నెయ్యిని పట్టుకోవడానికి పోటీ పడ్డారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని తోడుకోవడానికి అబాలగోపాలం ఎగబడటంతో అక్కడ సందడి నెలకొంది. ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ, జనం మాత్రం నెయ్యిని సేకరించడంలోనే నిమగ్నమయ్యారు. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Next Story






