Proddatur: జైలు నుంచి ఖైదీ మహమ్మద్ రఫీ పరార్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-16 13:43:26  IST  )

ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నారు.

Proddatur: జైలు నుంచి ఖైదీ మహమ్మద్ రఫీ పరార్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రొద్దుటూరు సబ్ జైలు(Proddatur Sub Jail) నుంచి రిమాండ్ ఖైదీ(Remand prisoner) మహమ్మద్ రఫీ తప్పించుకున్నారు. రాత్రి సమయంలో జైలు గోడ దూకి పరారయ్యారు. చోరీ కేసులో ఈ నెల 13న మహహ్మద్ రఫీని రాజు పాలెం పోలీసులు(Raju Palem Police) అరెస్ట్ చేశారు. అనంతరంకోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు రఫీకి ధర్మాసనం రిమాండ్ విధించింది. దీంతో ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులో ఉన్న రఫీ.. సిబ్బంది కళ్లు కప్పి పారిపోయారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహహ్మద్ రఫీని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు.

Next Story