కడప జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 17:29:06  IST  )

కడప జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది....

కడప జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం..?
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. బద్వేలు(Budvel)లో ఓ ఫర్నిచర్ దుకాణం(furniture store)లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నిర్వహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ. 50 లక్షల విలువైన సామగ్రి దగ్ధమైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కళ్ల ఎదుటే దుకాణం మొత్తం కాలి బూడిదయి పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story