పరిస్థితి దారుణం.. రెండు జిల్లాల్లో వైసీపీకి బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు జిల్లాలో బిగ్ షాక్ తగిలింది...

పరిస్థితి దారుణం.. రెండు జిల్లాల్లో వైసీపీకి బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YsrCongress Party)కి రెండు జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ గుడ్ బై చెప్పారు. అనంతరం తెలుగుదేశ పార్టీ(Telugu Desam Party) కండువా కప్పుకున్నారు. విజయనగరం(Vijayanagaram), తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో తమకు గట్టి బలం ఉందని చెప్పుకునే వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా టీడీపీ(Tdp)లో చేరారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ కప్పల వరలక్ష్మి, ఉప సర్పంచ్ వింత అమర ప్రసాద్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు ఎమ్మెల్యే మద్దిరాజు వెంకటరరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు విజయనగరంలో జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజాంనగరంలో 200 మంది వైసీపీ కుటుంబాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కొండ్రు మురళి సమక్షంలో టీడీపీలో చేరారు.

Next Story