- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
విద్యుత్ చార్జిల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగింది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు(Ycp Leaders) నిరసనలకు దిగారు. విద్యుత్ ఛార్జిల పెంపు(Electricity Charges Increase)పై అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఇచ్చిన పిలుపుమేరకు ఉదయం నుంచే జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జిలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జిల పెంపుపై ప్రజానీకాన్ని మోసం చేస్తూ రూ.15,500 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేశారని ఆరోపించారు. చార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా వైసీపీపై నిందలు వేస్తున్నారన్నారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు కూటమి నేతలు మానుకోవాలని సూచించారు. తల్లికి వందనం అన్నారని, ప్రతి మహిళకు 1500 అన్నారని, ఉచిత బస్సు, గ్యాస్ అన్నారని, అవి అన్నీ ఏమైపోయాయని వైసీపీ నాయకులు ప్రశ్నించారు.






