పార్లమెంట్ సాక్షిగా.. అమరావతి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-01 07:44:50  IST  )

పార్లమెంట్ సాక్షిగా అమరావతి చట్ట బద్ధత బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది...

పార్లమెంట్ సాక్షిగా.. అమరావతి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సాక్షిగా అమరావతి(Amaravati) చట్ట బద్ధత బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) వ్యతిరేకించింది. అంతేకాదు నిరసనగా లోక్ సభ(Loksabha) నుంచి వాకౌట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) బృందంలోని ఎంపీలంతా లోక్ సభ నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు లోక్ సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి తాము వ్యతికేకం కాదని, కానీ బట్టబద్ధత బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, వారి ప్రయోజనాలను పట్టించుకోవాలని సూచించారు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అమరావతిని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారో చెప్పాలన్నారు. ఎప్పటిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తారో క్లారిటీగా చెప్పాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story