- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైసీపీ ఎంపీలు కీలక చర్చలు.. సానుకూలం
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కీలక చర్చలు జరిపారు...

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి చెందిన ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lokhsabha Speaker OM Birla)ని కలిశారు. పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు, లోక్‌సభ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి(Gurumurthy) మాట్లాడుతూ పార్లమెంట్ పనితీరును మరింత మెరుగుపరచడానికి తమ అభిప్రాయాలు, సూచనలను స్పీకర్ తీసుకున్నారని తెలిపారు. సభా వ్యవహారాలు మరింత సజావుగా సాగేందుకు కొత్త విధానాలు, మెరుగైన సమన్వయం, బలమైన మద్దతు వ్యవస్థలు అవసరమని స్పీకర్ దృష్టికి తాము తీసుకెళ్లామని గురుమూర్తి చెప్పారు. ఎంపీలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. ఇందుకు ఓం బిర్లా సానుకూలంగా స్పందించారని గురుమర్తి పేర్కొన్నారు.
అంతకుముందు..
అంతకుముందు పార్లమెంటు అవతరణంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు ఆవరణంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వెరసి శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మా నేతలపై దుశ్చర్యలు
తమ నేతల ఇళ్లు, కార్లు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి దుశ్చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ను అమలు చేస్తున్నట్లుగా పరిస్థితి మారిందని, దీనివల్ల ప్రజలకు, ప్రతిపక్షాలకు న్యాయం పూర్తిగా దూరమైందని తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని ఇళ్లపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, పోలీసులు నిస్సహాయ స్థితిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితిపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన బాధ్యత తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.






