6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన.. వైసీపీ కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతోంది....

6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన.. వైసీపీ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో యూరియా(Urea) కొరత, రైతాంగం సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress Party) పోరాటానికి దిగుతోంది. సెప్టెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు త్వరలోనే యూరియా దిగుమతి అవుతోందని నాయకులు చెబుతున్నారు. ఈలోపే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే వ్యూహంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరసనకు పిలుపునిచ్చిందని తెలుస్తోంది.

Next Story