- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ సమావేశాల వేళ.. వైసీపీ కీలక నిర్ణయం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని స్పీకర్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
వైసీపీ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలు నిశ్చయించుకున్నారు. అయితే సమావేశాల మొత్తానికి కాదు. ఒక్క రోజు మాత్రమే సమావేశాలకు హాజరుకావాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు పాల్గొనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సమావేశాల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. చూడాల మరి ఏం జరుగుతుందో.






