మరో పీఠం కూడా పాయే.. విశ్వాసం కోల్పోయిన వైసీపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-23 10:24:13  IST  )

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది...

మరో పీఠం కూడా పాయే.. విశ్వాసం కోల్పోయిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి(Kadiri)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్న వేళ.. పలుచోట్ల విశ్వాన్ని కోల్పోతోంది. ఇప్పటికే అవిశ్వాసంలో విశాఖ పీఠాన్ని పోగొట్టుకుని కుదేలైన ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కదిరి మున్సిపాటిలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పాలన సాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొద్ది రోజులుగా కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నారు. ఈ మేరకు చైర్ పర్సన్ పై అవిశ్వాసం తీర్మానం ఇచ్చారు.

బుధవారం ఓటింగ్ జరిగింది. ఇందులో 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. వైసీపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దీంతో కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ నజీ మున్నిసాపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ మేరకు కదిరి మున్సిపల్ పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కదిరి అభివృద్ధిలో భాగంలోనే అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు. త్వరలో టీడీపీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌ను ఎన్నుకుంటామని ఆ పార్టీ కౌన్సిలర్లు తెలిపారు.

Next Story