- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దువ్వాడపై జగన్ ఫైర్.. నటుడిని మించిపోయావంటూ క్లాస్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్( Mlc Duvvada Srinivas)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్‌ను దువ్వాడ కలిశారు. ఈ సందర్భంగా దువ్వాడకు జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారి జగన్‌తో దువ్వాడ భేటీ అయ్యారు. దీంతో అసలు ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా అని దువ్వాడను జగన్ ప్రశ్నించారు. తమలా సినీ నటులు కూడా ఉండరని దువ్వాడను హెచ్చరించారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
ఈ సందర్భంగా తాను పూర్తిగా మారిపోయినట్లు జగన్‌కు దువ్వాడ తెలిపారు. మండలిలో తాను ఎలా వ్యవహరించాలని అడిగిన దువ్వాడకు.. పరిస్థితిని బట్టి మాట్లాడాలని జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో దువ్వాడ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎమ్మెల్సీ దువ్వాడ పేర్కొన్నారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సామాన్య భక్తుడిగానే తన వాదనలు వినిపిస్తానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.






