YS Jagan: అధైర్య పడొద్దమ్మా.. నేనున్నా....!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-04 11:50:24  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు....

YS Jagan: అధైర్య పడొద్దమ్మా.. నేనున్నా....!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్(YSR Congress Party chief Jagan) భరోసా ఇచ్చారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, తమకు రోజులు వస్తాయని అంబటి ఫ్యామిలీకి జగన్ ధైర్యం చెప్పారు. అంబటి అరెస్ట్‌కు సంబంధించి లీగల్‌గా కూడా సాయం చేస్తానని తెలిపారు. అంబటి జైలు నుంచి బయటకు వచ్చే వరకూ ఎలాంటి గొడవలకు పోకుండా, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పట్టించుకోవద్దని అంబటి కుటుంబానికి జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించినా ఇలానే అక్రమంగా వ్యవహరిస్తోందని, కానీ అన్నింటిని గుర్తు పెట్టుకుందామని అంబటి కూతురు మోనికకు జగన్ సూచించారు.

సీఎంపై అసభ్య వ్యాఖ్యలతో భగ్గుమన్న టీడీపీ కార్యకర్తలు

కాగా సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. గుంటూరులోని ఆయన నివాసంపై దాడి చేశారు. ఇంటి అద్ధాలు, వాహనాలను ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబులు విసిరి మంటలు చెలరేగించారు. తమ అధినేతపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఇలానే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే సీఎంపై అంబటి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అంబడి ఇంటిపై దాడితో పరామర్శకు జగన్

దీంతో అంబటి కుటుంబాన్ని పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం గుంటూరులో పర్యటించారు. అంబటి ఫ్యామిలీని పరామర్శించారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ వెంట వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొంటాయేమోనన్న ఆందోళన వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు ఎక్కడికక్కడ పతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని కట్టడి చేశారు. ప్రస్తుతం అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ప్రభుత్వంపై ఏం కామెంట్స్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Next Story