- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి పంపకాల్లో షర్మిలకు తీవ్ర అన్యాయం.. అఫిడవిట్‌లో పచ్చి నిజాలు చెప్పిన వైఎస్ విజయమ్మ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కొంతకాలంగా ఆస్తుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆస్తుల వివాదంపై వైఎస్ సతీమణి విజయమ్మ స్పష్టత ఇచ్చారు....

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) కుటుంబంలో కొంతకాలంగా ఆస్తుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆస్తుల వివాదంపై వైఎస్ సతీమణి విజయమ్మ(Vijayamma) స్పష్టత ఇచ్చారు. అలాగే మీడియాకు ఒక బహిరంగ అఫిడవిట్‌ను విడుదల చేశారు. వైసీపీ నేతల ప్రచారంపై వాస్తవాలను ఆమె వివరించారు. తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడడ్డి బతికున్నంత వరకు ఆస్తుల పంపకాలు జరగలేదని తెలిపారు. అప్పట్లో ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ తెలిపారు. మనుమలు, మనుమరాండ్రకు ఆస్తులను సమానంగా పంచాలన్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని చెప్పారు. ఈ విషయం తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారందరికీ తెలుసని విజయమ్మ వెల్లడించారు.
జగన్, షర్మిల మధ్య ఎంవోయూ
తన కుమారుడు జగన్(Jagan), కుమార్తె షర్మిల(Sharmila) మధ్య ఎంవోయూ (MOU) జరిగింది. షర్మిలకు రాసిన ఆస్తులన్నీ ఆమెకు న్యాయబద్ధంగా దక్కాల్సినవేనని విజయమ్మ స్పష్టం చేశారు. నిజానికి షర్మిలకు దక్కాల్సిన వాటా కంటే తక్కువే ఎంవోయూలో రాశారని, సరస్వతి సిమెంట్స్, యెలహంక భూమి పూర్తిగా షర్మిలకే ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకు షర్మిలకు ఇచ్చినట్లు చెబుతున్న నగదు కేవలం వ్యాపారాల ద్వారా వచ్చిన డివిడెండ్ మాత్రమేనని, అది ఆస్తి పంపకం కిందకు రాదని విజయమ్మ క్లారిటీ ఇచ్చారు.
ఆస్తుల వ్యవహారంలో వాళ్లిద్దరికీ తీవ్ర అన్యాయం
ఆస్తుల వ్యవహారంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా తన కుమారుడు ఎప్పటికైనా మనసు మార్చుకుని చెల్లికి న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒకే రకమైన ఆస్తులను పిల్లలిద్దరికీ వైఎస్సార్ కేటాయించారని, ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు దేవుడికి, తన కుమారుడికి తెలుసని విజయమ్మ వ్యాఖ్యానించారు.
కుటుంబ విషయాలు వాడుకోవద్దు
రాజకీయ అవసరాల కోసం కుటుంబ విషయాలను వాడుకోవద్దని విజయమ్మ కోరారు. దేవుడి సాక్షిగా తాను చెబుతున్నవన్నీ పచ్చి నిజాలని, అందుకే అఫిడవిట్‌లో నొక్కి చెబుతున్నానని ఆమె వివరించారు. ఎవరెన్ని వాదనలు వినిపించినా, ప్రచారాలు చేసినా చివరకు దేవుడి న్యాయమే గెలుస్తుందన్నారు. తల్లిగా ఇద్దరు పిల్లల సంక్షేమాన్ని కోరుకుంటూన్నానని, ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం ఉందని తనకు ఉందని విజయమ్మ తెలిపారు.






